అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IRCTC | రైల్వే సిబ్బంది ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు ప్రయాణికులని భయబ్రాంతులకి గురి చేస్తుంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో వారి ప్రవర్తన అందరు షాక్ అయ్యేలా చేస్తుంది.
తాజాగా సోషల్ మీడియాలో (Social media) ఇటీవల వైరల్‌గా మారిన ఒక వీడియో చూసి అందరు నోరెళ్లపెడుతున్నారు. ఈరోడ్-జోగ్‌బాని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (16601)లో క్యాటరింగ్ సిబ్బంది ఉపయోగించిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను వాష్ బేసిన్‌లో కడుగుతున్న దృశ్యం వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది..ఓ ప్రయాణికుడు ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత, ప్రజలు ఆహార పరిశుభ్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
IRCTC | క్లీన్ చేసి..
వీడియోలో కనిపించిన దృశ్యం చూసి రైల్వేలోని ఆహార భద్రతా ప్రమాణాలపై అధికారుల నిర్లక్ష్యం ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నారు. ఓ వ్యక్తి డిస్పోజబుల్ కంటెనర్లను వాష్ బేసిన్‌లో కడిగి.. ఒక దగ్గర పెట్టాడు. అయితే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకుంది. ఐఆర్సీటీసీ విడుదల చేసిన ప్రకటనలో .. వీడియోలో కడిగిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను తిరిగి ప్రయాణికుల భోజనానికి ఉపయోగించలేదని స్పష్టం చేసింది. ఆ పని చేసిన వ్యక్తిని వెంటనే విధుల నుంచి తొలగించగా, లైసెన్స్‌ను రద్దు చేసి భారీ జరిమానా విధించారు. డిస్పోజబుల్ కంటైనర్లు ఒకసారి మాత్రమే ఉపయోగించేలా ఉంటాయని, ప్రయాణికుల భోజనానికి మళ్లీ ఉపయోగించడం జరగలేదని దర్యాప్తులో తేలింది.
రైల్వేలో (Railway) ఆహార భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌లు క్రమం తప్పకుండా పాటించబడుతున్నాయని IRCTC గుర్తించింది. అంతేకాకుండా, భవిష్యత్తులో ప్రయాణికుల ఆహార భద్రతను మరింతగా పెంపొందించడానికి ఐఆర్సీటీసీ అనేక చర్యలు చేపడుతుంది. కిచెన్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భోజన తయారీని పర్యవేక్షించడం, క్యాటరింగ్ సేవలకు తప్పనిసరి FSSAI ధృవీకరణ అమలు చేయడం, నిరంతర తనిఖీలు నిర్వహించడం వంటివి చేస్తున్నట్టు ఐఆర్సీటీసీ పేర్కొంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూసిన వారు రైళ్లో తినాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
16601 Erode–Jogbani Vande Bharat catering staff demonstrating how recycling aluminium food-foil helps sustainability, conserves natural resources, and reduces pollution.
They could’ve reused it without washing, but then, apart from environment, they care about your health too. pic.twitter.com/hIETMjjNPo
— THE SKIN DOCTOR (@theskindoctor13) October 19, 2025