ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​TTD | తిరుమల భక్తులకు అలర్ట్​.. ఈ నెల 15, 16న వీఐపీ బ్రేక్‌ దర్శనాల...

    TTD | తిరుమల భక్తులకు అలర్ట్​.. ఈ నెల 15, 16న వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

    Published on

    అక్షరటుడే, తిరుమల: TTD : తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తుల సౌకర్యార్థం టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. జులై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను (Tirumala VIP Darshan) రద్దు చేసింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.

    TTD : ప్రొటోకాల్​ వారికే అనుమతి..

    జులై 15, 16 తేదీల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam), ఆణివార ఆస్థానం (Anivara Asthanam) వంటి మహత్తర శ్రీవారి ఉత్సవాలు (Srivari festivals) నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఆయా రోజుల్లో ప్రొటోకాల్‌ (protocol) పరిధిలో ఉండే ప్రముఖుల సిఫారసులను మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది.

    TTD : భక్తుల సహకారం కోరిన టీటీడీ

    తిరుమల దేవస్థానం నిర్వహణకు భక్తులు తమ సహకారం అందించాలని టీటీడీ కోరింది. ఉత్సవాల సమయంలో భక్తులకు దర్శనాల్లో కొంత మార్పులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు భక్తులు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...