అక్షరటుడే, ఆర్మూర్: Ex MLA | ఇందిరమ్మ పేరుతో తెలంగాణలో హింసాత్మక రాజ్యం సాగుతోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former Armoor MLA Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర (Meenakshi Natarajan padayatra) సందర్భంగా జిల్లావ్యాప్తంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్‌లో తన ఇంటి చుట్టూ, నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ పోలీసులను మోహరించడం దారుణమన్నారు.
Ex MLA | ఆర్మూర్ అంటేనే రైతులు..
ఆర్మూర్ పేరు చెబితేనే రైతులు (Farmers) గుర్తొస్తారని.. అలాంటి రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. పాదయాత్ర చేస్తున్న మీనాక్షి నటరాజన్‌ను ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.