అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dichpalli | డిచ్పల్లి సీఐ(Dichpalli CI)గా కడారి వినోద్ రెడ్డి నియమితులయ్యారు. ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న ఆయనను ఇక్కడికి బదిలీ చేస్తూ.. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి (IG Chandra Shekar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ప్రస్తుతం డిచ్పల్లి సీఐగా కొనసాగుతున్న మల్లేశ్‌ను ఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. త్వరలోనే నూతన సీఐ బాధ్యతలు స్వీకరించనున్నారు.
డిచ్పల్లి సీఐగా పనిచేసిన మల్లేశ్ కు గత సీపీ కల్మేశ్వర్ పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనే ఇన్స్పెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గానికి హెడ్‌క్వార్టర్‌గా ఉన్న డిచ్పల్లి సీఐ పాత్ర కీలకం కానుంది. దీనికోసం స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన వినోద్ రెడ్డిని ఇక్కడికి బదిలీ చేయించుకున్నట్లు సమాచారం.