Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Navratri celebrations | వినాయక నవరాత్రుల సంబరాలు.. లంబోదరుడి సేవలో భక్తజనం!

Vinayaka Navratri celebrations | వినాయక నవరాత్రుల సంబరాలు.. లంబోదరుడి సేవలో భక్తజనం!

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Vinayaka Navratri celebrations : నిజామాబాద్​ నగరంలో గణేశ్​ నవరాత్రి వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. వినాయక నగర్ కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గణనాథునికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

అలరించిన చిన్నరుల వేషధారణ

Vinayaka Navratri celebrations | వినాయక నవరాత్రుల సంబరాలు.. లంబోదరుడి సేవలో భక్తజనం!
Vinayaka Navratri celebrations | వినాయక నవరాత్రుల సంబరాలు.. లంబోదరుడి సేవలో భక్తజనం!

గుమస్తా కాలనీలోని దుర్గామాత ఆలయంలో చిన్నారుల వేషధారణ ప్రదర్శన ముచ్చటగా సాగింది. కృషుడు, గణపతి, పోతరాజు, అన్నపూర్ణ దేవి, గోపిక తదితర వేషధారణల్లో చిన్నారులు అలరించారు.

చిన్నారుల అమాయక హావభావాలు, అందమైన వేషధారణలు Children’s costumes ముచ్చటగొలిపాయి. ఆహూతులు మంత్ర ముగ్దులయ్యారు.

సంప్రదాయ traditions విలువలను చిన్న వయసులోనే నేర్పించే ఈ తరహా కార్యక్రమాలు తల్లిదండ్రులు, పెద్దల నుంచి ప్రశంసలు అందుకున్నాయి.

ఆలయ వాతావరణం భక్తి devotion, ఆనందం, సాంస్కృతిక కాంతులతో నిండిపోయింది. ఆలయ అధ్యక్షులు ఆమందు విజయ్ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు.

చిన్నారులు మన సంస్కృతి, సంప్రదాయాలను అలవోకగా ఆచరిస్తూ ఈ తరహా వేషధారణల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, గణేష్ కమిటీ అధ్యక్షులు ధాత్రిక గంగాసాయి, కార్యదర్శి ధాత్రిక అఖిల్ రాజ్, సభ్యులు హరీష్, ప్రవీణ్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.