అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | నగరంలోని వినాయక మండళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ శ్రీనివాస్‌రాజు (Town CI Srinivas Raj) సూచించారు. వినాయక్‌నగర్‌లోని (Vinayaka nagar) ఓ ఫంక్షన్ హాల్లో నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth) ఆధ్వర్యంలో వినాయక మండపాల (Vinayaka mandapaalu) నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ.. మండపాల వివరాలు పోలీస్‌శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌కు సంబంధించిన అనుమతి సైతం తీసుకోవాలని పేర్కొన్నారు. మండపాల వద్ద ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండాలని రాత్రివేళల్లో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మండపాల్లో నిద్రించాలన్నారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రి పది దాటిన తర్వాత సౌండ్‌బాక్స్‌లు పెట్టవద్దని తెలిపారు.
వినాయక విగ్రహాలను తీసుకువచ్చే.. తీసుకెళ్లే సమయంలో ఐరన్ పైప్‌లను కాకుండా పీవీసీ పైప్‌లను మాత్రమే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ తహశీల్దార్ బాలరాజు (Tahsildar Balaraju), ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (Electricity Department) ఏడీఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఏఈ వాజీద్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, 200 మంది వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.