అక్షరటుడే, ఇందూరు: Vinayaka Laddu : గణేశ్ శోభాయత్ర వేడుకగా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర Ganesh Shobhayatra నిర్వహిస్తున్నారు.
మరోవైపు ఆయా మండపాల్లో లంబోధరుడి లడ్డూ Lambodhar’s Laddu వేలం auction కొనసాగుతోంది. రూ. లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడటం లేదు.
నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వినాయకుడి లడ్డూను దక్కించుకునే మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది.
Vinayaka Laddu : భలే డిమాండ్..
ఈ నేపథ్యంలో వినాయకుడి లడ్డూకు డిమాండ్ ఉంటోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ వేడుకలు కొనసాగుతున్నాయి.
నగరంలోని అంబేడ్కర్ కాలనీలోని రాధాకృష్ణ థియేటర్ వద్ద ఉన్న శ్రీ గణేశ్ మండలి లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికింది.
శ్రీ గణేశ్ మండలి లడ్డూను రూ.1,65,001 కు తాటిపల్లి శైలేందర్ కుమారుడు తాటిపల్లి అక్షయ్ దక్కించుకున్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మండలి ప్రతినిధులు పూజలు చేశారు.