అక్షరటుడే, ఆర్మూర్ : Panchayat Elections | సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) నేపథ్యంలో మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామంలో కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ (Congress Party) మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి సల్మాన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా మండలంలోని ఒడ్యాట్ పల్లిలో సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ తరపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా వినయ్ కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy) మాట్లాడుతూ.. ముల్లంగి గ్రామ అభివృద్ధికి నిధులు ఇప్పిస్తానని డ్రెయినేజీ, రోడ్ల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద 98 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించానని వివరించారు. లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ముల్లంగి పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు కేటాయించేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాక్లూర్ మండల అధ్యక్షుడు రవి ప్రకాశ్, సొసైటీ ఛైర్మన్ అశోక్, ముల్లంగి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.