అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pahalgaon terror attack | పహల్గావ్లో pahalgaon terror attack జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. పలువురు ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతాన్ని కలిచివేసింది. కాగా.. కళ్లెదుటే తమ కుటుంబీకులను కోల్పోయిన వారి ఆర్తనాదాలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉగ్రమూకల కాల్పుల్లో ప్రాణాలు విడిచిన వారిలో లెఫ్టినెంట్ వినయ్ leftinent vinay ఒకరు. ఈయనకు ఆరు రోజుల క్రితమే హిమాన్షితో వివాహం జరిగింది. హనీమూన్ ట్రిప్ కోసం ఈ జంట మినీ స్విట్జర్లాండ్‌గా mini switzerland చెప్పుకునే పహల్గావ్కు వెళ్లింది.
సరదాగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. వారి కాల్పుల్లో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోగా.. తన భర్త మృతదేహం పక్కన నవ వధువు హిమాన్షి రోదిస్తున్న దృశ్యం యావత్ భారతావనిని కంటతడి పెట్టించింది. కాళ్ల పారాణి ఆరకముందే భర్తను కోల్పోవడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా.. బుధవారం భర్త అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సమయంలో వినయ్ పార్థీవదేహం వద్ద కన్నీటి పర్యంతమైంది. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని.. దేశం ఓ విలువైన పౌరుడిని కోల్పోయిందంటూ రోదించింది. ‘జైహింద్’ అంటూ భర్తకు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లెఫ్ట్‌నెంట్ వినయ్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన భార్య హిమాన్షి#PahalgamTerroristAttack #vinaynarwal #Navyofficer #HimanshiParashar #JammuKashmir #PahalgamTerrorAttack pic.twitter.com/xI6qni1ZQh
— Akshara Today (@aksharatoday) April 23, 2025