అక్షరటుడే, ఆర్మూర్: Podduturi Vinay Reddy | ప్రభుత్వ మద్దతుతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి (Podduturi Vinay Reddy) పేర్కొన్నారు. శనివారం ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో (Congress party) చేరగా వారిని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.
Podduturi Vinay Reddy | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వినయ్ రెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్దతుతో ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని అలాగే.. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ (MPTC and ZPTC elections) అభ్యర్థులు విజయం సాధించేవిధంగా కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సర్పంచ్‌గా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి అప్పల గణేష్, ఉప సర్పంచ్ దార్ల సుసేన్, వార్డు సభ్యులు మేతరి లక్ష్మి, కచ్చకాయల లక్ష్మి, ధ్యావతి పుష్ప, కొప్పెల నీతు, ఆమేతరి గంగాధర్, దేవతి అరుణ్ కుమార్, పుష్కూర్ గంగ నరసయ్య, బాస బాలయ్య, రావుట్ల గంగాధర్ తదితరులు ఉన్నారు. గోవింద్‌పేట గ్రామానికి చెందిన పలువురు యువకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుల్లెట్ రమేష్, నోముల నవీన్, గోలి దిలీప్, బండమిది అజయ్, నల్ల రాజా రెడ్డి, మేతరి నర్సయ్య, సయ్యద్ పాషా, ఇంతియాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.