HomeతెలంగాణUra Pandaga | నగరంలో ఊర పండుగ "బండారు" కార్యక్రమం.. పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

Ura Pandaga | నగరంలో ఊర పండుగ “బండారు” కార్యక్రమం.. పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: Ura Pandaga | ఇందూరులో ఈ నెల 13న జరిగే ఊర పండుగకు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నగరంలోని గాజుల్​ పేటలో (Gajul Peta) బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు.

Ura Pandaga | ఊర పండుగ ప్రారంభ సూచికగా..

ఊర పండుగ ప్రారంభ సూచికగా బండారును పోస్తారు. ఈరోజు నుంచి ఊర పండుగ గ్రామదేవతల ఊరేగింపు వరకు ఊరు దాటి వెళ్లొద్దని ప్రజలు విశ్వసిస్తారు. కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ కన్వీనర్ గంగాధర్, కో‌‌–కన్వీనర్ ప్రవీణ్, అన్ని కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Ura Pandaga | ఖిల్లా వద్ద ప్రారంభం

ఊర పండుగను ఈనెల 13న (ఆదివారం) ప్రారంభించనున్నారు. పండుగను పురస్కరించుకొని అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమాన్ని నగరంలోని ఖిలా వద్ద నుంచి ప్రారంభిస్తారు. ఒక ఊరేగింపు ఖిల్లా చౌరస్తా నుంచి పెద్ద బజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల ఊరేగింపు ఉంటుంది. ఇక మరో గ్రామ దేవత దుబ్బ వైపు తరలి వెళ్తుంది. వేడుకలో నిజామాబాద్​లోని అన్ని కుల సంఘాల సభ్యులు పాల్గొంటారు.

Must Read
Related News