ePaper
More
    HomeతెలంగాణMajor Road Accident | వికారాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

    Major Road Accident | వికారాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: major road accident : వికారాబాద్ జిల్లా(Vikarabad district)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రగాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

    వికారాబాద్ పరిగి మండలం(Parigi mandal) రంగాపూర్ (Rangapur) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను సందీప్, మల్లేష్, బాలమణి, హేమలతగా గుర్తించారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి(Chenvelli village) గ్రామానికి చెందినవారు పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    ఈ ఘటన జరిగిన సమయంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పరిగి ప్రభుత్వాసుపత్రికి parigi district hospital తరలించేలోగా మరో ముగ్గురు చనిపోయారు. పలువురి చేతులు, కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...