ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vijayawada | డిసెంబ‌ర్ చివ‌రి నాటికి అందుబాటులోకి రానున్న కొత్త బైపాస్..గంట‌కి పైగా స‌మ‌యం ఆదా

    Vijayawada | డిసెంబ‌ర్ చివ‌రి నాటికి అందుబాటులోకి రానున్న కొత్త బైపాస్..గంట‌కి పైగా స‌మ‌యం ఆదా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijayawada | ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని కీలక ప్రాజెక్ట్ విజయవాడ పశ్చిమ బైపాస్(Vijayawada West Bypass) నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి నాటికి ఈ బైపాస్ పూర్తిగా అందుబాటులోకి రానుంది అని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు పూర్తవగా, మిగిలిన ప్రాంతాల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్యాకేజీ వారీగా పనుల పురోగతి జ‌రుగుతుంది. ప్యాకేజీ-1: గుండుగొలను – కలపర్రు, ప్యాకేజీ-2: కలపర్రు – చినఆవుటపల్లి. ఈ రెండు భాగాల్లోని నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

    Vijayawada | ప‌నులు శ‌ర‌వేగంగా…

    ప్యాకేజీ-3 (చినఆవుటపల్లి – గొల్లపూడి) మరియు ప్యాకేజీ-4 (గొల్లపూడి – కాజ వద్ద) పనులు త్వరలో పూర్తయ్యే దశలో ఉన్నాయి. గత ఏడాది నుంచీ కొనసాగుతున్న ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్(Lanco Transmission High Tension) టవర్ల మార్పిడి సమస్య చివరకు పరిష్కార దశకు చేరుకుంది. పాత అలైన్‌మెంట్‌నే కొనసాగిస్తూ, టవర్ల ఎత్తును పెంచి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు NHAI ప్రతిపాదనలు ఢిల్లీ(Delhi)కి పంపించింది. అనుమతులు వారంలో రానున్నాయి అని అధికారులు ఆశిస్తున్నారు. అనుమతులు రాగానే డిసెంబర్ చివరి వరకు అన్ని పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.

    బైపాస్ పూర్తవడం వల్ల విజయవాడ – గుంటూరు మధ్య ప్రయాణ సమయం గంట వరకు తగ్గనుంది, ట్రాఫిక్ ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రయాణీకులకు సురక్షిత మార్గం అందుబాటులోకి వస్తుంది . ప్ర‌స్తుతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Infrastructure) పనులు అయితే వేగంగా జ‌రుగుతున్నాయి. కాజ వద్ద ల్యాండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స‌ర్వీస్ రోడ్లు విభజన , 230 మీటర్ల రక్షణ గోడ,యూటర్న్ మార్గాలు , కొండవీటి వాగు వద్ద 50 మీటర్ల తవ్వకం పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రెండు వారాల్లో తవ్వకాలు ముగించి రోడ్డు పునర్నిర్మాణం పూర్తిచేస్తారు. బైపాస్ ద్వారా వచ్చే వాహనాలు నేరుగా నేషనల్ హైవే-16(National Highway-16) మీదకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వీస్ రోడ్ల మార్గదర్శకాలతో ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫారిన్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) పర్యటన తర్వాత ప్రారంభమైన పనులు తుది దశకు చేరుకున్నాయి. సంక్రాంతి నాటికి విజయవాడ(Vijayawada) పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు

    Latest articles

    Chat GPT | చాట్​ జీపీటీ గుడ్​న్యూస్​.. 5 లక్షల మందికి ఉచిత యాక్సెస్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chat GPT | ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)​ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. పలు రంగాల్లో...

    Bheemgal Police | డయల్ 100కు ఆకతాయి ఫోన్​.. చివరకు ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal Police | డయల్​ 100కు ఫోన్​చేసి న్యూసెన్స్​ చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష...

    Vinayaka Chavithi | గణేష్ మండళ్లు, ప్రైవేట్​ ఎలక్ట్రీషియన్లు నిబంధనలు పాటించాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | గణేష్ మండళ్లు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని...

    Mulugu | రీల్స్ కోసం వెళ్లి అడవిలో తప్పిపోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu | ప్రస్తుతం యువత సోషల్​ మీడియాకు బానిసలుగా మారారు. రీల్స్​, షార్ట్స్​ చేసి...

    More like this