అక్షరటుడే, వెబ్డెస్క్ :Y Vijaya | వై విజయకి అన్ని ఆస్తులు ఉన్నాయా.. ఎన్టీఆర్ ఫ్యామిలీ(NTR Family)కి చాలా క్లోజ్ సీనియర్ నటి వై విజయ y vijaya ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో రాణించింది. F2 సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ప్రేక్షకులు గుర్తుంచుకునేలా మంచి కామెడీ పాత్రని చేసారు. తాజాగా వై విజయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకుంది. సీనియర్ యాక్టర్స్ చాలా మంది దాన ధర్మాలు చేసి, సేవింగ్స్ చేసుకోక చివరి రోజుల్లో ఏమి లేకుండా పోయారు. నేను కాస్త సేవింగ్స్ చేసుకున్నాను. హైదరాబాద్(Hyderabad) లో అయితే నాకు ఎక్కువ ఆస్తులు లేవు. చెన్నైలో నాకు మూడు ఇల్లులు, ఒక కల్యాణ మండపం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి.అందుకే ఎక్కువగా చెన్నైలోనే ఉంటాను.
Y Vijaya | అంత మంచి పరిచయం..
నాకు కల్యాణ మండపం, కాంప్లెక్స్ మీద రెంట్స్ వస్తాయి. 1985 నుంచి 2000 వరకు నేను బిజీగా సినిమాలు చేయడంతో అప్పుడే సేవింగ్స్ చేశాను. హైదరాబాద్ Hyderabad లో ఇల్లు కొనాలనుకున్నాను కాని కుదరలేదు, భవిష్యత్తులో చూడాలి. నేను ఇక్కడ ఉండను కాబట్టే నాకు తెలుగులో అవకాశాలు అంతగా రావడం లేదని వై విజయ పేర్కొంది. బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్ ఫ్యామిలీ(NTR Family) అందరితో నాకు మంచి ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. నేను 11 ఏళ్ళప్పుడు చెన్నై వెళ్లాను. అక్కడ చినవెంపటి సత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకుందామని అక్కడికి వెళ్లాను. అప్పుడు అక్కడికి ఎన్టీఆర్ పిల్లలు వచ్చేవాళ్ళు. అక్కడ మంచి పరిచయం ఏర్పడింది.
బాలయ్యతో Bala Krishna పలు సినిమాలు చేశాను. ఓ సారి రాజమండ్రిలో షూట్ జరిగితే షూట్ అయ్యాక బాలయ్య అత్తయ్య గారి ఊరు కాకినాడ కావడంతో అక్కడికి డిన్నర్ కి తీసుకెళ్లారు. మేము ఎప్పుడైన షూటింగ్ లో బాలయ్యతో ఉంటే ఆయన భార్య వసుంధర, అక్క పురంధేశ్వరికి కాల్ చేసి విజయతో మాట్లాడండి అని ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారి భార్య భువనేశ్వరిని ఒకసారి సూపర్ మార్కెట్ లో కలిసాను. నన్ను గుర్తుపట్టి మంచిగా మాట్లాడింది. ఇంటికి రమ్మని కూడా పిలిచింది అంటూ ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది వై విజయ . ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.