అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay – Rashmika | టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గురించి మళ్లీ హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఇద్దరి రిలేషన్ గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నా, ఎప్పుడూ అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ స్టార్ జంట తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోబోతున్నారట. సినీ వర్గాల సమాచారం మేరకు విజయ్ – రష్మిక అక్టోబర్‌లోనే సన్నిహిత బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారని టాక్. ఆసక్తికరంగా, “ది గర్ల్‌ఫ్రెండ్” ప్రమోషన్లలో రష్మిక (Rashmika Mandanna) చేతికి కనిపించిన డైమండ్ రింగ్ ఆ నిశ్చితార్థ రింగ్‌గానే ఉందని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.
Vijay – Rashmika | ఇందులో నిజమెంత?
ఆమెను ఆ రింగ్ గురించి అడిగినప్పుడు రష్మిక సిగ్గుపడుతూ, “మీకు నచ్చింది అనుకోండి” అని చెప్పడం ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. ఇక విజయ్ (Vijay Deverakonda) కూడా ఇటీవలి రోజుల్లో ఎంగేజ్‌మెంట్ రింగ్ (Engagement Ring)తో పలు ప్రదేశాల్లో కనిపించడంతో, అభిమానులు వీరి వివాహం త్వరలోనే జరుగుతుందని ఖాయంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం, ఈ జంట పెళ్లి 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో జరగనుందట. ఇంతవరకు ఈ వార్తలపై విజయ్ కానీ, రష్మిక కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం కూడా అభిమానుల్లో కుతూహలం పెంచుతోంది. పండితులు ముహూర్తం ఫిక్స్ చేశారా లేక నెటిజన్లు ఊహించారా అనేది తెలియాల్సి ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం “#VijayWedsRashmika” హ్యాష్‌ట్యాగ్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది.
ఏదేమైనా, ఈ సెన్సేషనల్ జంట గురించి వస్తున్న వార్తలు మాత్రం ఆగేలా లేవు. రౌడీ ఫ్యాన్స్, నేషనల్ క్రష్ అభిమానులు మాత్రం ఒకే మాట అంటున్నారు.“ఇది నిజమైతే, టాలీవుడ్‌లో ఈ ఏడాది బెస్ట్ వెడ్డింగ్ ఇదే. ఇక రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుండగా, మరి కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
