అక్షరటుడే, ఆర్మూర్: Vijay High School | ఆర్మూర్ విజయ్ హైస్కూల్ 44వ టాలెంట్ షోను (Talent show) ఈనెల 16న నిర్వహించనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ కవిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టాలెంట్ షోకు ముఖ్యఅతిథిగా డైరెక్టర్ రోహిణి, రైటర్, స్టేజీ ఆర్టిస్ట్ డా. సంధ్య విప్లవ్ హాజరుకానున్నట్లు తెలిపారు.
సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ టాలెంట్షోకు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరుకావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.