HomeUncategorizedJana Nayagan | విజ‌య్ బర్త్​డే స‌ర్‌ప్రైజ్‌.. ప‌వ‌ర్ ఫుల్ గెట‌ప్‌లో ద‌ళ‌ప‌తి

Jana Nayagan | విజ‌య్ బర్త్​డే స‌ర్‌ప్రైజ్‌.. ప‌వ‌ర్ ఫుల్ గెట‌ప్‌లో ద‌ళ‌ప‌తి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Jana Nayagan | దళపతి విజయ్‌ (Vijay) ఎన్నికల్లోకి వెళ్లేముందు చివరగా జన నాయగన్‌(జన నాయకుడు) అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ, జగదీష్‌ పళనిస్వామి, లోహిత్‌ ఎన్​కే నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఈ మూవీని పూర్తిచేసే పనిలో ఉన్నారు విజయ్‌. ఈ చిత్రం విష‌యంలో చాలా కేర్‌ తీసుకుని, బలమైన కంటెంట్‌తో జన నాయగన్‌ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.

Jana Nayagan | వీడియో అదుర్స్..

గ‌తంలో అజిత్‌తో తునీవు, వాలిమై, కార్తీతో ఖాకీ వంటి భారీ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ హెచ్ వినోద్ (H Vinod) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల త‌ర్వాత ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ వ‌చ్చింది. ఆదివారం విజ‌య్ జ‌న్మ‌దినం (Vijay Birth Day) సంద‌ర్భంగా సినిమా నుంచి రోరింగ్ లుక్ పోస్ట‌ర్‌, వీడియో విడుద‌ల చేశారు. దీంతో త‌మిళ‌నాట విజ‌య్ అభిమానుల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇందులో పోలీస్ గెట‌ప్‌లో క‌నిపించి ర‌చ్చ చేస్తున్న విజ‌య్. ఫ్యాన్స్‌కు ఈ వీడియో ఫుల్ ఖుషీని అందిస్తుంది. ఇదిలాఉంటే మొద‌టి నుంచి ఈ చిత్రం తెలుగులో బాల‌కృష్ణ(Nandamuri Balakrishna) భ‌గ‌వంత్ కేస‌రి చిత్రానికి రీమేక్ అని ప్ర‌చారం జ‌ర‌గ‌గా అలాంటిదేమీ లేద‌ని మేక‌ర్స్ చెబుతూ వ‌చ్చారు.

పూర్తిగా కొత్త కథతోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని టాక్. ఇక నేటితో విజయ్‌ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆదివారంతో ఆయన 51లోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో ఈ బర్త్​డే ఆయనకు చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. పైగా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం అంటున్నారు. ఇక విజ‌య్ గతేడాది రాజకీయాల్లోకి (Politics) ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిలాగ వెట్రి కజగమ్‌ (TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు.