HomeUncategorizedIndia Day parade | న్యూయార్క్​లో ఘ‌నంగా 'ఇండియా డే' పరేడ్.. సంద‌డి చేసిన విజ‌య్...

India Day parade | న్యూయార్క్​లో ఘ‌నంగా ‘ఇండియా డే’ పరేడ్.. సంద‌డి చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India Day parade : టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న Rashmika mandanna మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో కొనసాగుతున్నా, ఈ జంట మాత్రం ఇప్పటికీ తమ బంధంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. అయినా, వీరిద్దరూ తరచూ కలిసి ట్రిప్స్‌కు వెళ్లడం, ఫెస్టివల్స్‌ను కలిసి సెలబ్రేట్ చేయడం, సోషల్ మీడియాలో ప్రేమగా పోస్టులు పెట్టుకోవడం వంటి విషయాలు అభిమానులలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. విజయ్, రష్మికలు చాలాకాలం తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. న్యూయార్క్ నగరంలో భారత స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 43వ ఇండియా డే పరేడ్‌లో వీరిద్దరూ గ్రాండ్ మార్షల్స్‌గా సత్కరించబడ్డారు.

India Day parade : మ‌రోసారి ప్ర‌త్యక్షం..

ఈ సందర్భంగా పరేడ్‌లో పాల్గొన్న వారు వేడుకల్లో సందడి చేయగా, విజయ్ – రష్మిక జోడీ అందరి దృష్టినీ ఆకర్షించింది. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చిత్రసీమ సమ్మె కారణంగా అన్ని మూవీ షూటింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ Vijay Devarakonda నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా అది వాయిదా పడింది. అదే విధంగా రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. దీంతో షూటింగ్స్ లేకపోవడంతో ప‌రేడ్‌కి కొంత సమయం కేటాయించి ఆ త‌ర్వాత వెకేషన్‌కి వెళ్ల‌బోతున్న‌ట్టు విశ్వసనీయ వర్గాల నుంచి స‌మాచారం లభిస్తోంది.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారో లేదో అన్నది అధికారికంగా తెలియకపోయినా, ఇలా తరచూ కలిసి కనిపిస్తూ ఉండటంతో అభిమానులు మాత్రం “త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెప్ప‌డం ఖాయం” అని ఫిక్స్ అయిపోయారు.ఇక న్యూయార్క్ ఇండియా డే ప‌రేడ్‌ Newyork india day parade లో పరేడ్‌లో కాంగ్రెస్ సభ్యుడు థానేదార్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, పార్లమెంటు సభ్యుడు సత్నామ్ సింగ్ సంధు సహా అనేక మంది ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.