HomeసినిమాVijay – Rashmika engaged | విజయ్ దేవరకొండ – రష్మిక నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి?

Vijay – Rashmika engaged | విజయ్ దేవరకొండ – రష్మిక నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay – Rashmika engaged | టాలీవుడ్​ నటుడు విజయ్​ దేవరకొండ Tollywood actor Vijay Deverakonda, అందాల తార రష్మిక Rashmika ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా, వీరిద్దరు ఎంగేజ్​మెంట్​ చేసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. కానీ, ఈ ప్రేమజంట మాత్రం దానిని నిర్ధారించలేదు. ఈ పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది.

టాలీవుడ్‌లోని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక శుక్రవారం (అక్టోబరు 3) రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇరు కుటుంబాల సమక్షంలో, ఇద్దరు తారల సన్నిహితులు మాత్రమే ఈ నిశ్చితార్థంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమం రహస్యంగా జరిగినందున.. బయటకు ఎలాంటి ఫొటోలు రాలేదు. విజయ్, రష్మిక ఇద్దరూ అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్​ చేయాల్సిందే.

Vijay – Rashmika engaged | ఇద్దరూ చాలా కాలంగా..

విజయ్, రష్మిక ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ, వారిద్దరూ తమ అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దాని గురించి బహిరంగంగా ఇప్పటి వరకు మాట్లాడలేదు.

కానీ, పుకార్లు వెలువడటానికి సంకేతాలు మాత్రం ఇచ్చారు. ఈ జంట చాలాసార్లు రెస్టారెంట్లలో తిరుగుతూ కనిపించింది. చాలా సందర్భాలలో సెలవులకు వెళ్తూ దర్శనం ఇచ్చింది.

కానీ, ఇప్పటివరకు కూడా వారు గోప్యతనే పాటిస్తూ వచ్చారు. చివరకు, నిశ్చితార్థం గురించి వచ్చిన వార్తతో ఈ పుకార్లన్నీ ముగిసిపోయినట్లే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సన్నిహితులు తెలిపారు.

కాగా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు సూపర్​ హిట్​ కావడంతో విజయ్ ఫామ్​లోకి వచ్చాడు. ఇక పుష్ప ఫ్రాంచైజ్, యానిమల్ చిత్రాలు పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌ కావడంతో రష్మిక మందాన Rashmika Mandanna నేషనల్ క్రష్‌గా ఎదిగింది.

రష్మిక కన్నడలో కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసింది. అనంతరం తెలుగు, బాలీవుడ్‌ Bollywood లో ఫామ్​లోకి వచ్చింది. ఇక ఈ జంట విషయానికి వస్తే.. రష్మిక – విజయ్​ దేవరకొండ కలిసి గీత గోవిందం Geetha Govindam, డియర్ కామ్రేడ్ Dear Comrade చిత్రాల్లో నటించారు.