
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Deverakonda | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ(Producer Nagavamshi) నిర్మించారు. ఇక చిత్ర కథానాయికగా భాగ్యశ్రీ భోర్సే(Heroine Bhagyashree Bhorse) నటించింది. చిత్రంలో సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్(Trailer Launch Event) ఘనంగా నిర్వహించారు. కొంత ఆలస్యం అయినా, రాత్రి 10 గంటల తర్వాత ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూసిన వారు “ఇది చూసాక మళ్లీ ‘అర్జున్ రెడ్డి’ రోజులు గుర్తొస్తున్నాయి” అని కామెంట్ చేస్తున్నారు.
Vijay Deverakonda | రాయలసీమ యాసలో..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ.. రాయలసీమ(Rayalaseema) యాసలో మాట్లాడి అభిమానులను ఉర్రూతలూగించాడు. ‘‘హలో తిరుపతి… ఎట్లా ఉన్నారు అందరూ?.. బాగుండారా?.. బాగుండాలి. ఈ తూరూ నేరుగా మీ కాడికే వచ్చినాము. మీ అరుపులు, కేకలు వింటుంటే గుండె నిండిపోతుంది. ఏడాది నుంచీ ‘కింగ్డమ్’(Kingdom) గురించి ఆలోచిస్తుంటే ఒకటే అనిపిస్తాంది.. మన తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామిగానీ ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో, చాలా పెద్దొన్నై పూడుస్తా సామీ.. పోయి టాప్‌లో కూర్చుంటా. ఈ సినిమా కోసం టీమ్ అంతా ప్రాణం పెట్టి పని చేసింది. ఇక మిగిలింది వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. ఇవి ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు,” అంటూ విజయ్ ధీమాగా పేర్కొన్నాడు.
విజయ్ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు కేకేలతో ఆ ప్రాంగణం దద్దరిల్లేలా చేశారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయలసీమ యాసలో విజయ్ మాట్లాడిన తీరు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే, ‘కింగ్డమ్’పై హైప్ మరింత పెరిగింది. కొన్నాళ్లుగా మంచి సక్సెస్ రాక నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు ఈ చిత్రం మంచి విజయం అందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ సారి ఏం చేస్తాడా అనేది.