ePaper
More
    Homeసినిమాvijay deverakonda | ఆదివాసి వివాదం.. స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

    vijay deverakonda | ఆదివాసి వివాదం.. స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: vijay deverakonda | రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి Vijay Devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఆయ‌న కొన్ని సార్లు మాట్లాడే మాట‌లు వివాదాల‌లో పడేస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు controversial comments చేసి విమర్శలు కొనితెచ్చుకున్న విజయ్ దేవరకొండ Vijay Devarakonda రీసెంట్‌గా పహల్​గామ్​ ఉగ్రదాడిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద హాట్ టాపిక్ అయింది. పహల్​గామ్​ ఉగ్రదాడి Pahalgam terror attack వందల సంవత్సరాల క్రితం గిరిజన వర్గాల tribal communities మధ్య జరిగిన ఘర్షణలను పోలి ఉన్నాయి. అసలు 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకున్నట్లు, వీళ్లు (ఉగ్రవాదులు) బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ common sense లేకుండా పనులు చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ controversial comments చేశారు.

    విజ‌య్ వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ SC and ST అట్రాసిటీ కేసు న‌మోదు చేయాలంటూ హైద‌రాబాద్ లోని Hyderabad ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు SR Nagar Police ఫిర్యాదు అందింది. ఆయన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించగా, హైదరాబాద్ లోని న్యాయవాది లాల్ చౌహాన్ lawyer Lal Chauhan పోలీసులకు Police ఫిర్యాదు చేశారు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. అయితే ఈ విష‌యం విజ‌య్ దేవ‌ర‌కొండ Vijay Devarakonda దృష్టికి రావ‌డంతో ఈ విష‌యంపై తాను క్లారిటీ ఇవ్వాల‌నుకుంటున్న‌ట్టు విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ నోట్ note రిలీజ్ చేశాడు. నేను ఏ క‌మ్యూనిటీని కాని, ముఖ్యంగా మ‌న షెడ్యూల్డ్ తెగ‌ల‌ని బాధ‌పెట్టాల‌నేది నా టార్గెట్ కాదు. వారిని ఎంతో గౌర‌విస్తాను. వారిని దేశంలో కీల‌క భాగంగా భావిస్తాను. అక్క‌డ నేను మాట్లాడింది కేవ‌లం ఐక్య‌త గురించి మాత్ర‌మే. దేశం మొత్తం ఒక‌టేన‌ని, ప్ర‌జ‌లంతా ఒక‌టేన‌ని, మ‌నమంతా క‌లిసి ముందుకు ఎలా సాగాల‌నే దాని గురించే మాట్లాడాన‌ని చెప్పుకొచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

    ప్ర‌పంచంలో world మ‌న దేశం ఒక‌టిగా నిల‌బ‌డాల‌ని తాను ఎప్పుడు కోరుకుంటాను. అంద‌రిని నేను ఫ్యామిలీ family లాగానే భావిస్తాను. ఆ రోజు నేను వాడిన ట్రైబ్ Tribe అనే ప‌దం చారిత్రాత్మ‌క డిక్ష‌న‌రీ historical dictionary కోణంలో మాత్రమే వాడాన‌ని, ఎన్నో వంద‌ల ఏళ్ల కింద‌టే మాన‌వ స‌మాజాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా ట్రైబ్స్​గా, వంశాలుగా వ్య‌వ‌స్థీక‌రించార‌ని ఇది షెడ్యూల్డ్ తెగ‌ల వ‌ర్గీక‌ర‌ణ‌ను classification ఎప్పుడూ సూచించ‌లేద‌ని విజ‌య్ దేవర‌కొండ Vijay Devarakonda అన్నారు. ఇంగ్లిష్ డిక్ష‌న‌రీ ప్ర‌కారం ట్రైబ్ tribe అంటే ఏ అర్ధం వ‌స్తుందో కూడా తెలియ‌జేశాడు. అయితే త‌న మెసేజ్‌లో త‌ప్పు ఉండి, దాని వ‌ల‌న ఎవ‌రైనా బాధ‌ప‌డితే వారికి హృద‌య‌పూర్వ‌క క్ష‌మాప‌ణ‌ల‌ను తెలియ‌చేస్తున్న‌ట్టు విజ‌య్ చెప్పుకొచ్చాడు. అంద‌రూ ఐక్యంగా ఉండి క‌లిసిగ‌ట్టుగా ఉండాల‌నేదే త‌న ఉద్దేశం త‌ప్ప విడగొట్ట‌డం కాదు అని ఆయ‌న అన్నారు.

    More like this

    Lunar Eclipse | చంద్రగ్రహణం వేళ.. ఏం చేయాలంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Lunar Eclipse | భాద్రపద పౌర్ణమి రోజున అంటే ఈనెల 7న అరుదైన రాహుగ్రస్త...

    September 6 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 6 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 6,​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...