HomeUncategorizedVijay and Rashmika | ఏంటి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా..? వైర‌ల్...

Vijay and Rashmika | ఏంటి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా..? వైర‌ల్ అవుతున్న ఫొటోలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay and Rashmika | టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika mandanna) మధ్య డేటింగ్ పుకార్లు గత కొంత కాలంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించడం, ఒకే సమయంలో విదేశీ ప్రయాణాలు చేయడం వంటి సంగతులపై ఇప్పటికే పలుమార్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

తాజాగా ఈ వార్త‌లు బ‌ల‌ప‌రిచేలా విజయ్ – రష్మికలు పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలలో సాంప్రదాయ వేషధారణలో వధూవరుల్లా కనిపించిన విజయ్, రష్మికల మేకోవర్ చూసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Vijay and Rashmika | నిజంగానే జ‌రిగిందా?

ఫొటోలలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) షేర్వాణీలో దర్శనమివ్వగా, రష్మిక కంజీవరం చీరలో, మెడలో దండలు, నుదుట సిందూరంతో సంప్రదాయ వధువుగా (traditional bride) కనిపించారు. ఇవి చూసిన కొంతమంది అభిమానులు..“వాళ్లిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా?” అనే సందేహాలు వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఇవి ఖచ్చితంగా AI ఫొటోలు (Artificial Intelligence Photos) అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ లుక్ అలా లేదు. కింగ్‌డ‌మ్ కోసం రఫ్ లుక్‌లో మారాడు. దీంతో ఆ పిక్స్ ఏఐ పిక్స్ అంటూ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. గ‌తంలో తమ బంధం గురించి అడిగినప్పుడు విజయ్, రష్మిక ఇద్దరూ ఒకే రకమైన సమాధానం ఇచ్చారు.

మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ సోష‌ల్ మీడియాలో (Social Media) జ‌రుగుతున్న‌ ప్రచారాలను ఖండించారు. అయినప్పటికీ, వారిద్దరూ తరచూ కలిసే కనిపిస్తుండటం, ఒకరి సినిమాల‌కు ఒక‌రు స‌పోర్ట్ చేసుకోవ‌డం వంటివి అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తున్నాయి.

అయితే కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం ఇది నిజం అయితే బాగుండు అంటూ కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ, AI ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ- ర‌ష్మిక జంటగా గీతా గోవిందం (Geeta Govindam), డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.