HomeUncategorizedVijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కేసు...

Vijay Devarakonda | రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వారిని అవమానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కేసు న‌మోదు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Vijay Devarakonda : రౌడీబాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ vijay devarakonda వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో విజయ్ దేవ‌ర‌కొండ లేనిపోని చిక్కుల‌ని ఎదుర్కొంటూ ఉంటాడు.

ఈవెంట్స్‌లో ఆయన మాటలు కొన్నిసార్లు వివాదంగానూ మారుతుంటాయి. ట్రోల్స్ కి గురవుతుంటాయి. తాజాగా విజయ్‌ దేవరకొండ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై హైదరాబాద్‌లోని ఎస్‌ ఆర్‌ నగర్‌ sr nagar police station పోలీస్‌ స్టేషన్‌లో విజయ్‌పై కంప్లెయింట్‌ నమోదైంది. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ఫంక్షన్‌లో సంద‌డి చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

vijay devarakonda : చిక్కుల్లో విజ‌య్..

ఓ వర్గాన్ని ఆయన కించపరిచేలా మాట్లాడారంటూ ఓ లాయర్ Lawyer పోలీసులను ఆశ్రయించాడు. విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశాడు. ఆదివాసీయులను అవమానించారంటూ లాయర్ కిషన్ లాల్ చౌహాన్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కంప్లైంట్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇక త‌మిళ నటుడు సూర్యా actor surya నటించిన రెట్రో మూవీ ప్రమోషన్‌ ఈవెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో సూర్య, హీరోయిన్ పూజాహెగ్డే Pooja hegde పాల్గొన్నారు. జ్యోతిక, కార్తికేయన్‌ సంతానం కలిసి నిర్మించిన పాన్‌ ఇండియా చిత్రాన్ని కార్తీక సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ మూవీని తెలుగులో విడుదల చేసింది. ఈ మూవీ గురువారం విడుదలైంది. ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌కి జోడీగా యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించగా.. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Must Read
Related News