HomeసినిమాVijay - Rashmika | విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటకు కొత్త పరీక్ష.. 'ది...

Vijay – Rashmika | విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటకు కొత్త పరీక్ష.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఈవెంట్‌తో మళ్లీ హాట్ టాపిక్

గ‌త కొద్ది రోజులుగా విజ‌య్, ర‌ష్మిక‌ల రిలేష‌న్‌కి సంబంధించి నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ర‌ష్మిక న‌టించిన ది గర్ల్‌ఫ్రెండ్ ఈవెంట్‌కి విజయ్ దేవ‌ర‌కొండ హాజ‌రు అవుతాడా, ఈవెంట్‌కి హాజరై తన గర్ల్‌ఫ్రెండ్ గురించి మాట్లాడతాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay – Rashmika | టాలీవుడ్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న. వీరి రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్ని రూమర్లు వచ్చినా, వీరిద్దరూ మాత్రం ఎప్పుడూ క్లియర్ ఆన్సర్ ఇవ్వకుండా తెలివిగా తప్పించుకున్నారు.

“మేము కేవలం మంచి ఫ్రెండ్స్” అనటం కానీ, “అది నిజం కాదు” అని డైరెక్ట్‌గా చెప్పకపోవడం కానీ ఈ మిస్టరీపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించింది. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య రిలేషన్​ షిప్​ గురించి చర్చనీయాంశం కాగా.. ఇప్పుడు అదే టాపిక్ ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. కారణం రష్మిక (Rashmika Mandanna) నటిస్తున్న కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ .

Vijay – Rashmika | ‘ది గర్ల్‌ఫ్రెండ్’కు చీఫ్ గెస్ట్‌గా విజయ్?

ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Pre Release Event) విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాలనే ప్లాన్ జరుగుతోందట. ఈ వార్త బయటకు రావడంతోనే నెటిజన్లు, ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఇంటర్వ్యూల్లో తెలివిగా ప్రశ్నలు ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ విజయ్, రష్మిక ఒకవేళ ఈవెంట్‌లో స్టేజ్‌పై కలిస్తే మాత్రం తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ విజయ్ (Vijay Devarakonda) ఈవెంట్‌కు హాజరైతే, ఆయన సినిమా గురించి, ఆ టైటిల్ గురించి తప్పక మాట్లాడాల్సిందే. అప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం “విజయ్ ఏం అంటాడు?”, “రష్మికపై ఏమైనా హింట్ ఇస్తాడా?” అన్నదానిపైనే ఉంటుంది. వారి బాడీ లాంగ్వేజ్, ఒక్క స్మైల్, ఒక్క డైలాగ్ కూడా వైరల్ అవ్వడం ఖాయం.

మరోవైపు, విజయ్ ఈ రచ్చనంతా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈవెంట్‌కు రాకపోతే “ఎందుకు రాలేదు?”, “ఏమైనా అసౌకర్యమా?” అంటూ కొత్త రూమర్స్ మొదలవుతాయి. అయితే, ఆయన ఈవెంట్‌కు రాకపోయినా సినిమా టీంకు సోషల్ మీడియా ద్వారా లేదా వీడియో మెసేజ్ రూపంలో సపోర్ట్ ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా, ఈ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) ప్రమోషన్స్ విజయ్–రష్మిక జంటకు నిజమైన పరీక్షగా మారాయి. ఇన్నాళ్లుగా ఇంటర్వ్యూలలో కవర్ డ్రైవ్ ఆడుతూ మిస్టరీని కొనసాగించిన ఈ జంట, ఇప్పుడు లైవ్ ఈవెంట్ రూపంలో వస్తున్న “బౌన్సర్”ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Must Read
Related News