11
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Devarakonda met Revanth Reddy | విజయ్ దేవరకొండ (Actor Vijay Deverakonda)-రష్మిక(Actress rashmika) పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫిబ్రవరి 26న వారి పెళ్లి జరగనుందంటూ నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతుండగా, ఆ వార్తలపై పూర్తి క్లారిటీ రావడం లేదు. ఈ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డితో విజయ్ దేవరకొండ భేటీ చర్చనీయాంశంగా మారింది.
Vijay Devarakonda met Revanth Reddy | హాట్‌టాపిక్‌గా..
గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన వార్త ఏంటంటే యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ రష్మిక మందన్న Rashmika mandanna ఈ నెల 26న రాజస్థాన్‌లోని(Rajasthan) ఉదయ్‌పూర్‌లో(Udaipur) పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఈ వార్త గుప్పుమంటూ వస్తోంది. అయితే ఇప్పటివరకు ఇరువురి నుంచి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. విజయ్–రష్మికల పరిచయం 2018లో విడుదలైన గీత గోవిందం సినిమా సమయంలో ప్రారంభమైందని, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంతో వారి స్నేహం మరింత గాఢమై ప్రేమగా మారిందన్న వార్తలు అప్పటినుంచే వినిపిస్తూనే ఉన్నాయి.
రేవంత్ రెడ్డితో భేటీ..
ఈ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ఇప్పుడు వారి వ్యక్తిగత జీవితంపై ఆసక్తిగా మారింది. ఈ సమయంలో విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ను కలవడం ఈ పెళ్లి రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. ఆ భేటీ పెళ్లి ఆహ్వానం కోసమేనన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఎక్కడా వెలువడకపోవడం గమనార్హం. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలు ఈ నెల 22 నుంచే ప్రారంభమవుతాయని, 20వ తేదీన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్‌కు బయలుదేరే అవకాశముందని చెబుతున్నారు. పెళ్లి అనంతరం అభిమానుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వేదిక ఏర్పాట్లు కూడా గోప్యంగా జరుగుతున్నాయని సమాచారం.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన ఆసక్తికర అంశం ఏమిటంటే విజయ్ గానీ, రష్మిక గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం. అయితే ఒకేసారి అధికారిక ప్రకటన రూపంలో అభిమానులతో పంచుకోవాలని ఈ జంట నిర్ణయించుకుందన్న ప్రచారం ఉంది. ఇప్పటికైతే అభిమానులు, సినీ వర్గాలు అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త నిజమైతే టాలీవుడ్లో Tollywood ఇది ఈ ఏడాది అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు.