అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Devarakonda | టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కారు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యేలా చేసింది. అదృష్టవశాత్తూ ఆయన సురక్షితంగా బయటపడడం ఊరటనిచ్చింది.
ఈ ప్రమాదం సోమవారం (అక్టోబర్ 7) సాయంత్రం జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా ఉండవల్లి సమీపంలో చోటు చేసుకుంది. విజయ్ పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ Lexus LM 350h కారును ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.
Vijay Devarakonda | విజయ్ క్షేమం – స్వయంగా స్పందన
ఈ ఘటనపై విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్వయంగా స్పందించారు. తాను క్షేమంగా ఇంటికి చేరినట్లు తెలిపారు. “కొద్దిగా తలనొప్పి ఉంది కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కామెంట్స్‌తో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే విజయ్ ప్రయాణించిన కారు జపాన్‌కు చెందిన ప్రీమియం బ్రాండ్ Lexus LM 350h. ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన లగ్జరీ వాహనం. భద్రత, సౌకర్యం, లగ్జరీ పరంగా అత్యున్నత స్థాయిలో రూపొందించబడిన నేపథ్యంలో అంత పెద్ద ప్రమాదం జరిగినా విజయ్‌కి ఏమీ కాకపోవడానికి ఇది ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు.
LM 350h 7-Seater VIP మోడల్ ముఖ్య ఫీచర్లు:
- ధర: ₹2.15 కోట్లు (ఎక్స్-షోరూమ్)
- టాప్ స్పీడ్: 190 కిమీ/గంట
- టార్క్: 242 Nm @ 4300-4500 rpm
- 0-100 కిమీ వేగం: 8.7 సెకన్లు
భద్రత:
- 14 ఎయిర్‌బ్యాగ్స్
- స్పీడ్ లిమిట్ అలర్ట్
- యాంటీ థెఫ్ట్ ఇంజిన్ ఇమోబిలైజర్
- సెంట్రల్ లాకింగ్
- స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
లగ్జరీ ఫీచర్లు:
- సౌండ్ ప్రూఫ్ కేబిన్
- మసాజ్ సీట్లు
- రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్
- క్లైమేట్ కంట్రోల్
- వీఐపీ లాంజ్ లెవెల్ సౌకర్యం
ఏదేమైనా మొన్నీమధ్యే నిశ్చితార్థం జరుపుకున్న విజయ్ దేవరకొండ ఇలా రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యాడని తెలిసి అందరూ ఆందోళన చెందారు. అయితే ప్రమాదం అనంతరం విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకోగా ఆయన డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ దేవరకొండ లాంటి ప్రజాదరణ కలిగిన సెలబ్రిటీలు ప్రయాణించే సమయంలో ఇలాంటి ఘటనలు అభిమానుల్లో ఆందోళన కలిగించటం సహజమే. అయితే భద్రతా ఫీచర్ల కారణంగా పెద్ద అపాయం తప్పినట్లు చెబుతున్నారు.