HomeజాతీయంThalapathy Vijay | తొక్కిసలాటలో 39 మంది మృతి.. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం...

Thalapathy Vijay | తొక్కిసలాటలో 39 మంది మృతి.. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన విజయ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thalapathy Vijay | తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత తలపతి విజయ్ (Thalapathy Vijay) నిర్వహించిన ప్రచార సభలో జరిగిన దుర్ఘటన తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.

శనివారం తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కరూర్ పట్టణంలో జరిగిన సభలో భారీ సంఖ్యలో జనం హాజరవ్వగా, తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని 39 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ రాజకీయంగా తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన నేపథ్యంలో నిర్వహించిన ఈ సభకు అంచనాలకు మించి గుంపులుగా ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన జనం మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో విషాదం నెలకొనగా, చికిత్స పొందుతున్న అనేకమందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Thalapathy Vijay | బాధితులకు విజయ్ అండ

ఈ ఘటనపై స్పందించిన విజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక ప్రకటనలో ఆయన, “ఈ సంఘటనను మాటల్లో వివరించలేను. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఈ ఘటన నన్నెంతో కలిచివేసింది” అని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ప్రకటించారు. గాయపడినవారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.వారి కుటుంబాలకు ఇది జరిగిన నష్టాన్ని పూడ్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీ టీవీకే (TVK Party) ఎల్లప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉండబోతుందని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై అభిమానులు, సామాన్య ప్రజలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో (Social Media) స్పందిస్తున్నారు. విజయ్ సానుభూతి చూపిన తీరు, బాధిత కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం ప్రకటించడం ఆయన నైతిక బాధ్యతను ప్రతిబింబిస్తోంది” అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన త‌ర్వాత సభ ఏర్పాట్లలో అనుమతుల లేమి, భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవ‌నెత్తుతున్నాయి. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు People డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ కి ఆదిలోనే ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవ‌డం ఆయన రాజకీయ ప్రయాణానికి పెద్ద పరీక్షగా నిలవనుంది.

Must Read
Related News