అక్షరటుడే నిజాంసాగర్ : Nizamsagar | ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలను అలాగే వదిలేయడంతో ఈనెల 10న ‘లక్ష్యం ఘనం.. ఆచరణ శూన్యం’ శీర్షికన ‘అక్షరటుడే’లో (Akshara Today) కథనం ప్రచురితమైంది.
కథనానికి స్పందించిన ఉన్నత అధికారులు వెంటనే ఉపాధిహామీ పథకంలో భాగంగా నర్సరీల్లో (Nursery) నాటిన మొక్కలన్నింటినీ గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో నాటించేలా ఆదేశాలు జారీచేశారు. ఒక్కో గ్రామంలో 2,500 మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో మొక్కలు (Plants) నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉమ్మడి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారు.
