అక్షరటుడే, వెబ్డెస్క్: vigilance raids | నిజామాబాద్ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహించారు.
చీఫ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శశిధర్ రాజు నేతృత్వంలో.. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, కోటగిరి, పోతంగల్, బోధన్ తదితర మండల కేంద్రాల్లోని పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. కాగా.. వర్ని మండల కేంద్రంలో మూసి ఉన్న ఓ రైస్ మిల్లులో ఆరు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మిల్లు యజమాని వసీయుద్దీన్పై కేసు నమోదు చేశామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ శేఖర్ రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ తెలిపారు.
