అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy DMHO | కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిగా బిచ్కుంద డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్యారాన్ వల్కర్‌ను నియమించారు.
ఈ మేరకు ఆమె బదిలీపై వెళ్తున్న ఇన్‌ఛార్జి వైద్యాధికారి చంద్రశేఖర్ నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ వికారాబాద్ సివిల్ సర్జన్‌గా (Vikarabad Civil Surgeon) (ఆర్ఎంవో) బదిలీ అయ్యారు. కొత్తగా ఇన్‌ఛార్జి బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌వోకు పలువురు వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.
