అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలోని 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ (District Agriculture Officer Tirumala Prasad) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 25 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులో ఉందని, తాజాగా మంజూరైన వాటితో మొత్తం 72 రైతు వేదికల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభిస్తారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.