79
అక్షరటుడే, ఇందూరు: Victory Venkatesh | విక్టరీ వెంకటేష్ పుట్టినరోజును నగరంలో తెలంగాణ దగ్గుబాటి యువత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం (blood donation camp) నిర్వహించారు. అలాగే నగరంలోని దేవి థియేటర్లో మేనేజర్ నాగేశ్వరరావు, అభిమానులు కేక్ కట్ చేసి హీరో వెంకటేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Victory Venkatesh | వెంకీ మరిన్ని చిత్రాల్లో నటించాలి..
వెంకటేష్ ఆరోగ్యంతో ఉంటూ మరిన్ని చిత్రాల్లో నటించాలని.. విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ దగ్గుబాటి యువత రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, రాజు, చంద్రశేఖర్, ఆర్టిస్ట్ చందు, శ్రీకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.