అక్షరటుడే, డిచ్పల్లి : Victory High School | ఎస్సెస్సీ ఫలితాల్లో డిచ్పల్లి (Dichpalli) మండలంలోని విక్టరీ హైస్కూల్ (Victory High School) విద్యార్థులు ప్రతిభ చూపారు. స్కూల్ విద్యార్థులు మండలంలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించారు. విద్యార్థిని సిరిచందన 584, అక్షిత 571 మార్కులు సాధించారని యాజమాన్యం తెలిపింది. అలాగే 43 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు పొందినట్లు పేర్కొంది. వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించింది.