186
అక్షరటుడే, గాంధారి: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగియగా ఫలితాలు సైతం వెలువడుతున్నాయి. ఈ క్రమంలో గాంధారి (Gandhari) మండలంలోని చిన్న పోతంగల్ పంచాయతీలో ఒకే ఒక్క ఓటు తేడాతో ఓ అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
స్వంతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్‌కు 278 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థికి 277 కోట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో బెస్త సంతోష్ విజయం సాధించినట్లయ్యింది. దీంతో గ్రామంలో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.