అక్షరటుడే, ఎల్లారెడ్డి : Deputy Collectors Association | తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విక్టర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల రాష్ట్ర సంఘం వివరాలు వెల్లడించింది.
Deputy Collectors Association | కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా..
డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన విక్టర్ కామారెడ్డి జిల్లా (Kamareddy District) అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు (Additional Collector Victor) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డి, సంఘ సభ్యులు రాజలింగం, సంతోష్ కుమార్, ఠాగూర్, నిజాం, తురబ్ అలీ, శశి కిరణ్, శివకుమార్, సతీష్ కుమార్ పాల్గొన్నారు.