అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందేలా చూడాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం (Sadashivnagar Police Station Circle Office) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, తదితర విభాగాలు పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌లో పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. బ్లూ కోల్ట్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, విస్తృతంగా డ్రండన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు. సిబ్బందికి కేటాయించిన గ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, మోసాలు, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.