Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

Bheemgal | ఎస్సై కొట్టాడంటూ.. సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bheemgal | భీమ్​గల్​ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని సీపీ క్యాంపు కార్యాలయం (nizamabad Cp Camp office) ఎదుట ఓ వ్యక్తి ఆదివారం ఆందోళనకు దిగాడు.

బాధితుడు గుగ్లోత్​ బీను తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్​గల్​ మండలం రూప్ల తండాకు చెందిన బీను, అతని కొడుకు మధ్య ఇల్లు నిర్మాణం విషయంలో శనివారం గొడవ జరిగింది. దీంతో కొడుకు తన తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు భీమ్​గల్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి తండ్రి సైతం స్టేషన్​కు వచ్చాడు. ఈ క్రమంలో బీనును ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు లాఠీలతో తీవ్రంగా కొట్టారు. కాసేపటి తర్వాత వదిలేయడంతో బాధితుడు ఆర్మూర్​కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.

ఆదివారం నిజామాబాద్​ సీపీ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపాడు. అనంతరం స్పెషల్ బ్రాంచి సీఐ శ్రీశైలం అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.