Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | డాక్టర్​, వ్యాపారి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Nizamabad | డాక్టర్​, వ్యాపారి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

తనపై వేధింపులకు పాల్పడుతున్న డాక్టర్​, రియల్​ ఎస్టేట్​ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | ఓ మహిళపై నగరంలోని ప్రముఖ డెంటల్​ డాక్టర్​, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా బాధితురాలు నగరంలోని నాలుగో టౌన్​ పోలీస్​ స్టేషన్​లో (4th Town Police Station)​ ఫిర్యాదు చేసింది.

బాధితురాలు మాట్లాడుతూ.. తాను గతంలో ఓ​ ట్రావెల్స్​లో పని చేశానని తెలిపింది. అప్పటి నుంచే ఓ ప్రముఖ డెంటల్​ డాక్టర్​, ‘ఆయిల్’ పేరిట పేరు గల రియల్​ ఎస్టేట్​ వ్యాపారి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. సంస్థలో పని చేస్తున్న పనుల నిమిత్తం వచ్చి తనను అసభ్యంగా తాకేవారని వాపోయింది. అయితే అప్పుడు తనకు పెళ్లికాకపోవడంతో భయపడి ఎవరికి చెప్పలేదని తెలిపింది.

అక్కడ జాబ్​ మానేసిన తర్వాత కూడా వారు వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. రెండేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. వీడియో కాల్స్​ చేసి న్యూడ్​గా మాట్లాడమంటున్నారని, తోటకు రావాలని బెదిరిస్తున్నారని తెలింది. ఈ మేరకు సోమవారం సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya)ను కలిసి ఫిర్యాదు చేశానని పేర్కొంది. ఆయన సూచన మేరకు మంగళవారం నాలుగో టౌన్​ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.