Homeతాజావార్తలుCP Radhakrishnan | హైదరాబాద్​ పర్యటనకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​

CP Radhakrishnan | హైదరాబాద్​ పర్యటనకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​

ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ హైదరాబాద్​ పర్యటనకు వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CP Radhakrishnan | భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ (: Vice President of India CP Radhakrishnan) హైదరాబాద్​ పర్యటనకు వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay), రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్​తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

CP Radhakrishnan | గవర్నర్​ తేనేటి విందు

హైదరాబాద్​కు విచ్చేసి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​కు రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ రాజ్​భవన్​లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్​ను సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) సన్మానించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Must Read
Related News