- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Gymnasium | వీహెచ్​పీ, బజరంగ్​దళ్ వ్యాయామశాల ప్రారంభం

Gymnasium | వీహెచ్​పీ, బజరంగ్​దళ్ వ్యాయామశాల ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Gymnasium | మనిషి శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం (exercise) తప్పనిసరి అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార దర్శి వెంకన్న, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజకుడు శివరాములు (Bajrang Dal state coordinator Shivaramulu) అన్నారు.

వీహెచ్​పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆదర్శ్​నగర్​లో గల విశ్వహిందూ పరిషత్​ కార్యాలయంలో వ్యాయామశాలను (gymnasium) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాయామశాల కేవలం శారీరక దృఢత్వం కోసమే కాదని.. యువతలో ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఉచిత వ్యాయామశాలను ఇందూరులోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, విభాగ్ కార్యదర్శి కృష్ణ, జిల్లా కార్యదర్శి దయానంద్, ఆనంద్, ధాత్రిక రమేశ్​, నాంపల్లి శేఖర్, రాంప్రసాద్ చటర్జీ, నికేష్, బజరంగ్​దళ్​ అఖిల్, సురేష్, సుధీర్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News