అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samrajyam Promo | కోలీవుడ్ దర్శక నిర్మాతల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వెట్రిమారన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సామాజిక నేపథ్యం, హ్యూమన్ ఎమోషన్స్ లోతుగా ఆవిష్కరించే దర్శకులలో ఆయన ఒకరు.
ఐదు నేషనల్ అవార్డ్స్ సాధించిన దర్శకుడిగా, ఆయన సినిమాలు ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, అలానే కమర్షియల్ విజయాలను సొంతం చేసుకుంటాయి. అందుకే ప్రతి స్టార్ హీరో వెట్రిమారన్‌తో (Director Vetrimaaran) పనిచేయాలని కోరుకుంటారు. ప్రస్తుతం శింబు హీరోగా వెట్రిమారన్ సామ్రాజ్యం అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా ప్రోమో అంటూ ఐదు నిమిషాల వీడియో విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు, డైలాగ్స్ మూవీపై చాలా ఆసక్తిని పెంచాయి. అంతేకాక శింబు తనదైన స్టైల్‌లో నటించి అలరించాడు.
Samrajyam Promo | అంచనాలు పీక్స్‌లో..
వెట్రిమారన్ శింబు హీరోగా (Hero Simbu) మాస్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. తమిళంలో ‘అరసన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వెట్రిమారన్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకనే చెబుతోంది. ‘అరసన్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను వి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల కాబోతోంది. తెలుగు ప్రోమోను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు ఎన్టీఆర్ (Jr. NTR) మాట సాయం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎప్పటినుండో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలనే కోరిక తారక్‌కి ఉంది. గతంలో ఒక స్క్రిప్ట్ విషయంలో చర్చలు కూడా జరిగినట్లు టాక్ వచ్చింది. ఈ క్రమంలో సామ్రాజ్యం సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ అందించినట్టు టాక్.
ఏది ఏమైనా ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబోలో రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ వస్తే మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. గతంలో తారక్ హీరోగా నటించిన ‘బాద్ షా’ మూవీకి శింబు పాట పాడగా, ఇప్పుడు తెలుగులో శింబు సినిమాకి తారక్ మద్దతుగా నిలుస్తున్నారు.