అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Google Pixel 9 | సుమారు రూ. 80 వేల విలువైన గూగుల్ పిక్సెల్(Google Pixel 9) ఫోన్ సగానికన్నా తక్కువ ధరకే లభించనుంది. దీనిని రూ. 35 వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ, ఎప్పుడు అంటే..దసరా పండుగ సీజన్ సమీపిస్తోంది.
ఇప్పటికే ప్రముఖ ఇ-కామర్స్(e-commerce) సంస్థలు స్పెషల్ సేల్స్ డేట్స్ ప్రకటించాయి. ఆఫర్ల వివరాలను ఒక్కటొక్కటిగా వెల్లడి చేస్తున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్ కార్ట్(Flipkart), గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో అమెజాన్ పండుగ సీజన్‌కు సిద్ధమయ్యాయి. ఈనెల 23వ తేదీనుంచి స్పెషల్ సేల్ డేస్ ప్రారంభం కానున్నాయి. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ఈనెల 22 నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌డేస్(Big Billion Days)కు సంబంధించి కొన్ని ఆఫర్ల వివరాలు వెల్లడయ్యాయి.
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్(Smart Phone)ను కారు చౌకగా అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఈ మోడల్ గతేడాది లాంచ్ అయ్యింది. 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ వేరియంట్ ధర అప్పట్లో రూ. 79,999 ఉండేది. ప్రస్తుతం 64,999లకు విక్రయిస్తున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా దీనిని సగం ధరకే.. అంటే రూ. 37,999 లకే అందించనుంది. బ్యాంక్ ఆఫర్(Offer) కింద రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజీపై మరో వెయ్యి రూపాయలు తగ్గనుంది. అంటే రూ. రూ.34,999 లకే గూగుల్ పిక్సెల్ 9 ఫోన్‌ను విక్రయించనున్నారన్న మాట.