ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vijayanagaram | ట్యూష‌న్‌కి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌ బాలిక‌పై మాస్టార్ అత్యాచార య‌త్నం.. సాహ‌సం చేసి త‌ప్పించుకున్న...

    Vijayanagaram | ట్యూష‌న్‌కి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌ బాలిక‌పై మాస్టార్ అత్యాచార య‌త్నం.. సాహ‌సం చేసి త‌ప్పించుకున్న బాలిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | మానవత్వాన్ని మంటగలిపే ఘటన విజయనగరం జిల్లాలో (Vijayanagaram district) చోటు చేసుకుంది. గ్రామంలో పిల్లలకు ట్యూషన్ చెప్పే మాస్టారు (Tuition Master) మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ దారుణ సంఘటన భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, బూర్ల విజయ్ కుమార్ (Vijay Kumar) అనే వ్యక్తి తన ఇంటి వద్ద మరో మహిళతో కలిసి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. శనివారం రోజున ఆయన తోటి ఉపాధ్యాయురాలు అనారోగ్యం కారణంగా రాకపోవడంతో, తను ఒక్కడే క్లాస్‌లు నిర్వహించాడు. ఇదే అదునుగా తీసుకున్న తాను మూడో తరగతి చదువుతున్న ఓ బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు.

    READ ALSO  YS family | షర్మిల‌కు షాక్‌.. జ‌గ‌న్‌కు ఊరట.. స‌ర‌స్వ‌తి వాటాల బ‌దిలీపై స్టే

    Vijayanagaram | మ‌నిషేనా?

    అయితే దేవుడి దయతో అదే సమయంలో ఎవరో ఇంటికి వచ్చారు. వారి రాకతో విజ‌య్ కుమార్ తన నీచ చర్యను కొనసాగించలేకపోయాడు. దాంతో బాలిక గదిలో నుంచి తప్పించుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయింది. భయంతో వణికిపోయిన బాలిక జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు (Parents) వివరించింది. ఈ విషయాన్ని విన్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సోమవారం సాయంత్రం, విషయం గ్రామస్థులకు తెలియడంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయ్ కుమార్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు (police registered Case) చేశారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిపై పోక్సో చట్టం (Pocso ACT) కింద కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ‌స్థులు కోరారు. విజయ్ కుమార్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని గ్రామస్థులు తెలిపారు. కానీ పక్కా సమాచారం లేకపోవడంతో ఎవరు బయటపెట్టలేకపోయారని చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన వెలుగులోకి రావడంతో, అతడి గతాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఎంత నిఘా పెట్టాలో గుర్తు చేస్తోంది. ఎవరి ఇంట్లో, ఎవరితో పిల్లలు ఉన్నారు? వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు? అని గమనించడం తప్పనిసరి. పిల్లల నడవడికలు, భావప్రకటనలు మారితే వెంటనే స్పందించాలి.

    READ ALSO  New Ration Cards | ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం.. డిజిటల్​ కార్డులు అందజేస్తామన్న నాదెండ్ల

    Latest articles

    Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులు చర్యలు...

    PM Modi | చ‌ర్చ‌కు పట్టుబ‌ట్టి బొక్క బోర్లా ప‌డ్డారు.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ విసుర్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆప‌రేష‌న్ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చర్చకు ప‌ట్టుబ‌ట్టిన ప్రతిపక్షాలు బొక్క‌బోర్లా ప‌డ‌డంతో...

    Guvvala Balaraju | కేసీఆర్ వెళ్ల‌మంటేనే వెళ్లా.. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై గువ్వ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...

    Hyderabad | గ్యాస్ సిలిండర్​ పేలుడుకు కూలిన భవనం.. ఒకరి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ (Medchal)​లో...

    More like this