అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ అడ్మిషన్ల (Dost Admissions) ధ్రువప్రతాల పరిశీలన బుధవారం నుంచి చేపట్టనున్నారు. వర్సిటీలోని అడ్మిషన్స్ కార్యాలయంలో పరిశీలన నిర్వహించనున్నట్లు దోస్త్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లు రెండు సెట్లు జిరాక్స్‌లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కావాలని సూచించారు.
