Indalvai
Indalvai | కన్నుల పండువగా వెంకటేశ్వర కల్యాణం

అక్షర టుడే, ఇందల్వాయి: Indalvai | మండలకేంద్రంలోని తిర్మన్ పల్లిలో (tirmanpalli) ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి (sri venkateswara swamy) ఘనంగా పూజలు చేశారు. అనంతరం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బేరి పూజ కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాలు మంగళవారం వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.