ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Retired IPS officer | పోలీస్ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ నాశనం చేశాడు.. బాధ్యులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న...

    Retired IPS officer | పోలీస్ వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్ నాశనం చేశాడు.. బాధ్యులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న రిటైర్డ్ ఐపీఎస్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Retired IPS officer | మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై YS Jagan ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆయన ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎలాంటి ప‌నులు చేశారన్న‌ దానిపై విచార‌ణ కొన‌సాగుతుంది. అయితే జ‌గ‌న్‌పై మాజీ రిటైర్డ్ ఆఫీస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(Retired IPS officer AB Venkateswara Rao) తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాల్​లో ‘పోలీసు వ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై నిన్న జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

    Retired IPS officer | సంచ‌ల‌న కామెంట్స్

    జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి Court వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖ(Police Department)ను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు చైతన్యంతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీసు సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహనరెడ్డి హయాంలో జరిగిన దుర్మార్గాలన్నింటిపైనా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందేనన్నారు.

    సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

    కాగా.. ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswar rao) గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులకు గురయ్యారు. ఆ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక తప్పుడు అభియోగాలు, అక్రమ సస్పెన్షన్లు ఎదుర్కొన్నారు. 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకూ, 2022 జూన్‌ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకూ మొత్తంగా రెండు విడతల్లో దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌(Printing and Stationery Commissioner) హోదాలో పదవీ విరమణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల సస్పెన్షన్‌ కాలవ్యవధి మొత్తాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...