అక్షరటుడే ,భీమ్గల్ : Vemula Prashanth Reddy Criticism | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda MLA), మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల (Bheemgal Municipal Elections) ప్రచారంలో భాగంగా 3, 5, 6 వార్డుల్లో నిర్వహించిన ‘స్ట్రీట్ కార్నర్’ సమావేశాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు భీమ్గల్ను గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చి రూ. 200 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. మున్సిపాలిటీలో మిగిలిన పనుల కోసం తాను రూ.10 కోట్లు మంజూరు చేయిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.
Vemula Prashanth Reddy Criticism | ప్రభుత్వ వైఫల్యాల గుర్తింపు..
భీమ్గల్లో (Bheemgal) రూ.40 కోట్లతో చేపట్టిన 100 పడకల ఆస్పత్రి పనులు 80 శాతం పూర్తయినా మిగిలిన 20 శాతం పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బస్ డిపోను గాలికి వదిలేశారని, అక్కడ బస్సులు లేక బర్లు పడుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ. 2500, వృద్ధులకు రూ. 4000 పెన్షన్, తులం బంగారం వంటి హామీలు అమలు కాక ప్రజలు మోసపోయారని మండిపడ్డారు.
Vemula Prashanth Reddy Criticism | లింబాద్రి గుట్టను అభివృద్ధి చేశాం..
లింబాద్రి గుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ప్రయోజనం లేదన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులు బోదిరే లావణ్య నర్సయ్య, నీలం లావణ్య గంగాధర్, మూత లింబాద్రిలను గెలిపించాలన్నారు. ‘కారు’ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), కార్యకర్తలు పాల్గొన్నారు.