అక్షరటుడే, ఆర్మూర్/భీమ్‌గల్: KTR | తెలంగాణ భవన్లో (Telangana Bhavan) గురువారం జరిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(Former MLA from Armur Jeevan Reddy) పాల్గొన్నారు. కేటీఆర్‌కు కేక్ తినిపించారు.
కేటీఆర్ జన్మదినవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
KTR | భీమ్‌గల్‌లో..
భీమ్‌గల్ (Bheemgal) మండల కేంద్రంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పటాకులు కాల్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, సొసైటీ ఛైర్మన్ శివసారి నర్సయ్య, శర్మ నాయక్, మాజీ కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య,సతీష్ గౌడ్, మూత లింబాద్రి, మల్లెల ప్రసాద్, పర్స నవీన్, మాజీ సర్పంచ్ లు తాంశ రవీందర్, తోట శంకర్, పసుల రాజమల్లు, భూక్య సంతోష్, మాజీ ఎంపీటీసీలు సుర్జిల్, పతాని లింబాద్రి, నాయకులు గడాల ప్రసాద్, రహమాన్, ఇక్రమ్, డిష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్‌లో సంబురాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు
ఆర్మూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఆర్మూర్‌లోని సిద్దార్థ డిగ్రీ కళాశాలలో కేటీఆర్ జన్మదిన వేడుకలు హాజరైన ఓయూ నేత రాజారామ్ యాదవ్ .