3
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | వివిధ నేరాల్లో జప్తు చేసిన వాహనాలకు ఈనెల 17న వేలం నిర్వహించనున్నట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ ఎండి షాకీర్ (Excise CI MD Shakir) బుధవారం తెలిపారు. డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు వాగనర్ కారు, ఒక బైక్ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభమవుతుందని, ఆసక్తి గల వారు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు.