అక్షరటుడే, వెబ్డెస్క్: Yellareddy | హైదరాబాద్ – బోధన్ రహదారిపై (Hyderabad-Bodhan road) పనులు నత్తనడకన సాగుతున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలికంగా వేసిన రోడ్లు సరిగ్గా లేకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు పనుల్లో భాగంగా వంతెనల పనులు (bridge work) సాగుతున్న చోట్ల తాత్కాలిక రోడ్లు వేశారు. అయితే వేసిన మట్టి రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం తిప్పలు తప్పడం లేదు. గత మూడునాలుగో రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మట్టి రోడ్లపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శనివారం ఉదయం మాల్తుమ్మెద వద్ద పలు వాహనాలు మట్టిలో ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ సఖ్యంలో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ వాహనాలను బయటకు తీసే ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రైవేటు వాహనాలతో తొలగించే వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. ఇకనైనా రోడ్డు మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు కలుగుకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.